మైనర్ బాలిక రాజేశ్వరి మరణం బాధాకరం
మల్డకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక రాజేశ్వరి మృతి చెందడం బాధాకరమని.. గురువారం బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆగిపోగు రాంబాబు అన్నారు. జిల్లాలో ఒక సీడ్ ఆర్గనైజర్ బాలికను పనిలో పెట్టుకుని దొంగతనం చేసిందని నెపంతో తప్పుడు కేసు పెట్టడంతో బాలిక మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసి కర్నూలు పట్టణంలో 13 రోజుల పాటు చికిత్స పొందుతూ.. మృత్యువుతో పోరాడి నేడు తనువు చాలించడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.