Feb 24, 2025, 11:02 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
నారాయణపేట: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
Feb 24, 2025, 11:02 IST
జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని టీయూసీఐ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నారాయణపేట కలెక్టరేట్ లో డీపీవోకు వినతి పత్రం అందించారు. నాలుగు నెలల వేతనాలు పెండింగ్ లో వున్నాయని అధికారి దృష్టికి తీసుకెళ్లారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పినా నేటికీ అమలు కావడం లేదని, నెలకు రూ. 9500 ఇస్తున్నారని చెప్పారు.