అన్ని గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. దన్వాడ మండలం కిస్టాపూర్, మరికల్ మండలం పుసల్ పహాడ్ గ్రామంలో మంగళవారం నూతన పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.