నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన గ్రూప్ - 3 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైయ్యాయి. మొత్తం 13 పరీక్ష కేంద్రాల్లో 4023 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. సిబ్బంది అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాలోకి అనుమతిచ్చారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు.