రాజోలి: ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు కుమారుడి జననం
రాజోలి: మండల కేంద్రంలో స్థానిక పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కురువ శివ విధులు నిర్వహిస్తుంటాడు. అయితే మంగళవారం భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయనే సమాచారం మేరకు హుటాహుటిన రాజోలి నుండి తుమ్మలపల్లెకు బయలుదేరాడు. ఈ క్రమంలోనే బైక్ అదుపు తప్పి కింద పడడంతో గాయాలపాలైన శివ బుధవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివ మృతి చెందిన గంట వ్యవధిలోనే మృతుని భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది.