ఆశ్రమం అభివృద్ధి పనులకు రూ. 5 లక్షలు: ఎమ్మెల్యే

75చూసినవారు
ఆశ్రమం అభివృద్ధి పనులకు రూ. 5 లక్షలు: ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా పెబ్బేరులోని నిర్మలాచల రాజయోగ ఆశ్రమాన్ని ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి ఆదివారం సందర్శించారు. ఆశ్రమంలోని కాశీవిశ్వేశ్వర బాలబ్రహ్మేంద్రస్వామిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమంలో నెలకొన్న పలు సమస్యలను మెఘారెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే ఆశ్రమంలోని పనులకు రూ. 5లక్షలు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మెఘారెడ్డిని ఆశ్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్