జూరాలకు పెరిగిన వరద.. 7 గేట్లు ఎత్తివేత

83చూసినవారు
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకు మంగళవారం రాత్రి 7: 00 గంటల వరకు 84, 500 క్యూసెక్కులకు పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో 7 క్రస్ట్ గేట్ల ద్వారా 49, 721 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9. 657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9. 050 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విద్యుదుత్పత్తికి 36, 050 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్