ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వనపర్తి కలెక్టర్

54చూసినవారు
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తేమ శాతం పకడ్బందీగా పరిశీలించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలంలోని గోపన్ పేట, ఆత్మకూరు మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో తప్పనిసరిగా ఫ్యాన్లు, గన్ని బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు.

సంబంధిత పోస్ట్