శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తొలిరోజు ఈ మూవీ రూ.47.13 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. తెలుగులో రూ.38 కోట్లు, హిందీలో రూ.7 కోట్లు, తమిళ్ రూ.2 కోట్లు వసూలు చేసినట్లు తెలిపింది. చిత్రం విడుదల సందర్భంగా తొలి రోజు 1.3 మిలియన్ టికెట్లు అమ్ముడైనట్లు బుక్‌మై షో ప్రకటించింది.