PMMY పథకం ద్వారా రూ.20 లక్షల రుణం పొందండి

556చూసినవారు
PMMY పథకం ద్వారా రూ.20 లక్షల రుణం పొందండి
చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు రుణాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) స్కీమ్‌ను రూపొందించింది. దీని ద్వారా అర్హత ఉన్న వ్యక్తులు ఎలాంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. అయితే 2024-25 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ లోన్ అమౌంట్ ను రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.20 లక్షల వరకు రుణం పొందవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్ https://www.mudra.org.in/ని సందర్శించండి.