ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో రామేశ్వరం ఆలయం ఉంది. ఈ ఆలయ ఆవరణలో ఉన్న కోనేరు వద్ద అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ.. కోనేటిలో వరద నీరు కలవడం లేదంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదంతా దేవుడి మహిమా? సైన్స్ మాయాజాలమా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది ఇప్పటి వీడియో కాదని తెలిసింది. గతంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.