పారిస్ ఒలింపిక్స్‌లో 40 ఏళ్ల తర్వాత పాక్ స్వర్ణాన్ని అందుకుంది. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ అసాధారణ ప్రతిభతో ఏకంగా రెండు సార్లు 90 మీటర్లకుపైగా బల్లెం విసిరారు. వ్యక్తిగత విభాగంలో ఆ దేశానికి ఇదే తొలి మెడల్. మ్యాచ్ అనంతరం నీరజ్ తో షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫొటోను Xలో షేర్ చేస్తూ తామెప్పటికీ స్నేహితులమేనని నదీమ్ పేర్కొన్నారు.