దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి రేట్లు భారీగా పెరిగాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.79,470 ఉండగా, మంగళవారం నాటికి రూ.20 పెరిగి రూ.79,490కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.90,020 ఉండగా, ఇవాళ రూ.1,300 పెరిగి రూ.91,320గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, ప్రొద్దుటూరులో పది గ్రాముల బంగారం ధర రూ.79,490గా ఉంది. కిలో వెండి ధర రూ.91,320గా ఉంది.