అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం

55చూసినవారు
అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం
అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం కలకలం సృష్టిస్తోంది. లూసియానాలో ఓ వ్యక్తి(65) బర్డ్‌ఫ్లూ (H5N1) సోకి మరణించాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు పలు సమస్యలతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. అడవి పక్షులు, పెరటి మందకు దగ్గరగా వెళ్లడం వల్ల ఆ వ్యక్తికి హెచ్‌5ఎన్‌1 సోకిందని అక్కడి వైద్యాధికారులు తెలిపారు. అయితే, ఆ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్‌ వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్