ప్రజలకు మరో శుభవార్త చెప్పడానికి రేవంత్ సర్కార్ రెడీ అవుతుంది. ప్రజాపాలన పేరుతో ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించిన క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపైన ప్రభుత్వం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ పథకం ద్వారా నిరుపేదలకు ఇల్లు ఇచ్చే విషయంపైన మరో 15రోజుల్లో కీలక ఆదేశాలు వెలువడనున్నట్లు సమాచారం.