పిలకలు మరియు కొమ్మ కత్తిరింపులు ద్వారా చామంతిని సాగు చేస్తారు. వేర్లు తొడిగిన కొమ్మ కత్తిరింపులు లేదా పిలక మొక్కలను నాటుకోవచ్చు. తుపాన్ల కారణంగా ఎడతెరుపు లేకుండా వర్షాలు పడే సమయాలలో నీరు నిలబడే అవకాశం గల నేలల్లో రైతులు అదును చూసుకొని చామంతి ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. పొలంలో ఒకసారి కాకుండా 15-20 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు దఫాలుగా నాటినట్లయితే పూలు ఎక్కువ రోజులు కోసుకోవచ్చు.