రేషన్ బియ్యం అక్రమ రవాణా.. ‘సిట్’ సభ్యులు మార్పు!

76చూసినవారు
రేషన్ బియ్యం అక్రమ రవాణా.. ‘సిట్’ సభ్యులు మార్పు!
AP: రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్‌పై సమగ్ర విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం నుంచి వైసీపీ అనుకూల డీఎస్పీలుగా ముద్రపడ్డ అధికారులను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి స్థానంలో తటస్థంగా పని చేసే అధికారులకు చోటు కల్పించనుంది. సీఐడీ ఐడీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యులుగా ఉన్న డీఎస్పీలు మందుల బాల సుందరరావు, తాటపర్తి అశోక్‌వర్ధన్ రెడ్డి, ఆర్.గోవిందరావులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్