సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలన మార్పు తర్వాత అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అసద్ తండ్రి, మాజీ అధ్యక్షుడు హఫీజ్ అల్-అసద్ విగ్రహాలను తిరుగుబాటుదారులు, స్థానిక నిరసనకారులు ధ్వంసం చేస్తున్నారు. ఆయన విగ్రహాలను సరియా వీధుల్లో రోడ్లపై లాగుతూ హల్‌చల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.