మొబైల్ ఫోన్ రిఛార్జ్ చేసుకుంటే వాయిస్ కాల్స్, SMS, డేటా అన్ని ఒకే ప్లాన్లో వస్తాయి. కానీ ట్రాయ్ ఆదేశాల మేరకు ఇక నుంచి వాయిస్ కాల్స్, SMS సేవలు కావాలనుకునే వారికి ప్రత్యేక ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 SMSలను అందిస్తోంది. అలాగే ఏడాదికి రూ.1959 ప్లాన్, జియో రూ.458, రూ.1959, విఐ రూ.1460 ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి.