దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ ఇటీవల ఎస్బీఐ ప్యాట్రన్స్, హర్ ఘర్ లఖ్‌పతి RD అనే రెండు కొత్త పథకాల్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్యాట్రన్స్ స్కీమ్.. 80 ఏళ్లుపైబడిన వారి కోసం అధిక వడ్డీ రేటు చెల్లిస్తూ తీసుకొచ్చిన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్. ఇక హర్ ఘర్ లఖ్‌పతి పథకం విషయానికి వస్తే.. ఇది ఒక ప్రీ కాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్. ఇక్కడ రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ నిధుల్ని సమకూర్చుకునేందుకు ఉద్దేశించిన స్కీమ్.