ఆంధ్రప్రదేశ్‌లో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు ఫిబ్రవరి 1నుంచి పెరగనున్నట్లు తెలుస్తుంది. వీటిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విషయంలో మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందట. భూముల మార్కెట్ విలువ, బుక్ విలువ మధ్య ఎక్కువ తేడా ఉండటంతో, బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.