బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఇవాళ, రేపు కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 1000 మందికిపైగా విద్యార్థులు సురక్షితంగా భారత్ చేరారని, మరో 4 వేల మందితో టచ్‌లో ఉన్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.