వినాయక నిమజ్జనాల కోసం జీహెచ్‌ఎంసీ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ వద్ద రద్దీని తగ్గించేందుకు నగరంలోని కీలకమైన చెరువులతోపాటు ప్రధాన ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీటితో బేబీ పాండ్స్, పూల్ పాండ్స్‌ను సిద్ధం చేసింది. 24 గంటల పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ.. విగ్రహాలను ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసేలా భారీ క్రేన్లు, వ్యర్థాలను తొలగించేందుకు భారీ వాహనాలను అధికారులు సిద్ధం చేశారు.