సెంట్రల్ కాశ్మీర్ శ్రీనగర్ జిల్లాలో ఆదివారం మార్కెట్లో గ్రెనేడ్ పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో 12 మంది వరకు గాయపడ్డారు. సీనియర్ పోలీసు అధికారి వివరాల ప్రకారం.. టీఆర్సీ సమీపంలో రద్దీగా ఉండే మార్కెట్లో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.