సీఎం రేవంత్‌రెడ్డిపై BRS నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డి మాట్లాడితే చిన్నపిల్లలు చెడిపోతారని ఇంట్లో తల్లిదండ్రులు టీవీలు బంద్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడంలేదన్నారు.హైదరాబాద్‌కు 3 వైపులా సముద్రం ఉందని మాట్లాడటంతో సోషల్ మీడియాలో రేవంత్‌పై జోకులు పేలుతున్నాయని చెప్పారు. కేసీఆర్ భిక్షతో రేవంత్ సీఎం అయ్యారంటూ విమర్శించారు.