TG: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్‌పై గతంలో డీజీపీకి, జూబ్లీహిల్స్ ఏసీపీకి కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసిపి ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులు పరిశీలించి విచారణ చేశారు.