టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ ప్రశంసించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలిచిన భారత కెప్టెన్‌ను ఆమె అభినందించారు. 'ఛాంపియన్స్ ట్రోఫీ2025ను గెలుచుకున్న టీమిండియాకు అభినందనలు! అద్భుతమైన 76 పరుగులతో ముందుండి నడిపించిన కెప్టెన్ రోహిత్‌కు హ్యాట్సాఫ్' అని ఆదివారం ట్వీట్ చేశారు. ఇటీవల రోహిత్ శర్మపై ఆమె బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంతో విమర్శలొచ్చాయి.