తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి కుమార్తె రాత్రి సమయంలో ఏడ్చినందుకు ఓ వ్యక్తి పసికందును నేలకేసి కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన శివపుర జిల్లాలో ఆగస్టు 5న అర్ధరాత్రి జరిగింది. పసిబిడ్డ తల్లి నేరం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను చంపేసిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.