కవిత బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసిన ఈడీ

57చూసినవారు
కవిత బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్‌ పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆమె బెయిల్‌ పిటిషన్‌పై ఈడీ కౌంటర్‌ దాఖలు చేసింది. కేసులో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈడీ తరఫు లాయర్లు తెలిపారు. మరోవైపు సీబీఐ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 27న కౌంటర్‌ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది.