మహానందిలో చిరుత సంచారం

75చూసినవారు
మహానందిలో చిరుత సంచారం
ఏపీలోని నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. తాజాగా గోశాల సమీపంలో చిరుత పులి సంచరిస్తుండగా స్థానిక సీసీ ఫుటేజీలో దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో భక్తులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది స్పందించి చిరుతను బంధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరో వైపు చిరుతలు, ఏనుగులు జనారణ్యంలోకి వస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్