ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

72చూసినవారు
ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కారణంగా మరో మూడు రోజుల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయని స్పష్టం చేసింది. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో కూడా వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది. ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్