ఈ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు

11823చూసినవారు
ఈ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, హైదరాబాద్, మేడ్చల్ తదితర జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.