నెల్లూరు జిల్లాలో 2 పెద్దపులులు

81చూసినవారు
నెల్లూరు జిల్లాలో 2 పెద్దపులులు
AP: నెల్లూరు జిల్లాలో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ అధికారి బి.చంద్రశేఖర్‌ ధ్రువీకరించారు. ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు రేంజ్‌ పరిధిలో రెండు పెద్ద పులులు ఉన్నట్లు తెలిపారు. వ. వాటిలో ఒకటి రాపూరు పరిధిలోని పెంచల నరసింహస్వామి కొండప్రాంతంలో తిరుగుతోందన్నారు. ఇది కర్నూలు టైగర్‌ కారిడార్‌ నుంచి 2నెలల క్రితమే వచ్చిందని వెల్లడించారు. మరొకటి గతేడాది సెప్టెంబరులో నల్లమల కారిడార్‌ నుంచి వచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్