జనరల్ బోగీలు తగ్గి, ఏసీవి పెరిగాయి. ఫలితంగా జనరల్ బోగీల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రయాణించడానికి నరకయాతన పడుతున్నారు. చాలామంది జనరల్ కోచ్‌లో అడుగుపెట్టే జాగా లేక.. రిజర్వేషన్ బోగీలు ఎక్కుతున్నారు. టీసీలు వచ్చినా అంతమందిని ఏం చేయలేకపోతున్నారు. కొందరు టీసీలు మాత్రం ఫైన్ వసూలు చేస్తున్నారు. రైల్వే శాఖ నిర్ణయం వల్ల పేదలు, శ్రామికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.