బ్యాంకు డిపాజిట్లు, రుణాల వడ్డీరేట్లపై నియంత్రణను తొలగిస్తున్నామని RBI గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ఇకపై సొంతంగా వడ్డీరేట్లు నిర్ణయించుకోవచ్చని వెల్లడించారు. FM నిర్మలా సీతారామన్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా బ్యాంకింగ్ నియంత్రణ సవరణ చట్టం తీసుకొచ్చేందుకు చాన్నాళ్లుగా కసరత్తు చేశామని నిర్మల అన్నారు. సృజనాత్మక ఉత్పత్తులతో బ్యాంకులు డిపాజిట్లు పెంచుకోవాలని ఆమె సూచించారు.