హీరోయిన్ అదా శర్మకు అరుదైన జబ్బు

53చూసినవారు
హీరోయిన్ అదా శర్మకు అరుదైన జబ్బు
హీరోయిన్ అదా శర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'సినిమాల వల్ల నాకు ఓ అరుదైన జబ్బు వచ్చింది. కేరళ స్టోరీ కోసం బరువు తగ్గాను. బస్తర్ ది నక్సల్ స్టోరీకి బరువు పెరిగాను. ఇప్పుడు బార్ సినిమా కోసం మళ్ళీ బరువు తగ్గాను. ఇలా నెలల వ్యవధిలోనే శరీరంలో మార్పులు రావడం వల్ల ఆ ఒత్తిడికి ఎండోమెట్రియోసిస్ వ్యాధి వచ్చింది. ఈ జబ్బు కారణంగా దాదాపు 48 రోజుల పాటు ఆగకుండా వచ్చే పీరియడ్స్‌తో చాలా ఇబ్బంది పడ్డాను' అని అన్నారు.