తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని చూస్తున్న కమలం పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. బీసీ నినాదంతో గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆ పార్టీ.. ఆశించిన సీట్లను సంపాదించుకుంది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలను తన ఖాతాలో వేసుకుని ఈ సారి టార్గెట్ అధికారం అన్నట్లుగా పావులు కదుపుతోంది. బీజేపీ అధ్యక్షుని కోసం ఈ పార్టీ అన్వేషణ మొదలుపెట్టింది. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ వైపు అధిస్టానం మొగ్గు చూపుతుందన్న టాక్ వినిపిస్తోంది.