ఘోరం.. పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల చేతిని కోల్పోయిన మహిళ

77చూసినవారు
ఘోరం.. పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల చేతిని కోల్పోయిన మహిళ
ఉత్తరప్రదేశ్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. మహిళలు ఒళ్లు నొప్పుల గురించి క్వాక్ డాక్టర్ (అన్‌సర్టిఫైడ్) వద్దకు వెళ్తే వారికి త్వరగా ఉపశమనం కలిగించేందుకు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు చేస్తుంటారు. అక్కడి ఓ 32 ఏళ్ల మహిళకు వేసిన పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల ఆమె చేతిని కోల్పోయారు. ఈ విషయాన్ని లక్నోలోని KGMU చీఫ్ సర్జన్ సయ్యద్ వెల్లడించారు. తేలికపాటి నొప్పికి ఇంట్రా ఆర్టీరియల్ పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :