ఆకాశంలో రాత్రి వేళల్లో కొన్ని పదార్థాలు మెరుస్తూ భూమిపై జారి పడుతాయి. వాటినే ఉల్కలు అంటారు. గ్రహాలు ఏర్పడిన తొలి రోజుల్లో వాటి ఆకర్షణకు లోనుకాని కొన్ని శిలలు, ధూళి కణాలు విడివిడిగా మిగిలిపోయాయి. గ్రహాల్లాగానే ఇవి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. భూమి తన కక్ష్యలో తాను తిరుగుతున్నపుడు వీటిలో కొన్ని భూమ్యాకర్షణ శక్తికి లోనై భూవాతావరణంలోకి గంటకు 30,000 కి.మీ వేగంతో దూసుకువస్తాయి. ఆ క్రమంలోనే కాంతిని వెదజల్లుతాయి.