అంబర్‌ పేటలో సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు.

66చూసినవారు
అంబర్పేట నియోజకవర్గం బాగ్‌అంబర్‌ పేటలో సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు, పెద్దలు కలిసి ఆటపాటలు, డీజేల పాటలతో సందడి చేశారు. పలువురు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే మహిళలకు ఒక సంబురమైన పండుగ అని అన్నారు. అంతేకాకుండా ఆడపడుచులు మహాలక్ష్మి లాగా ముస్తాబై ఆటలు ఆడడం ఎంతో సంతోషదాయకంగా ఉంటుందని తెలిపారు. ప్రతి సంవత్సరం తమ వీధిలో బతుకమ్మ ఆటలు ఆడుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్