అంబర్ పేట్: బాడ్మింటన్ కోర్టు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
నల్లకుంట డివిజన్ టీఅర్టీ గ్రౌండ్ లో రూ. 16 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న బ్యాడ్మింటన్ కోర్టు ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ అమృతతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు వీలుగా నియోజకవర్గాలలో పలు క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. యువత క్రీడల్లో రాణించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని అయన సూచించారు.