ప్రజా సమస్యలు పరిష్కరించడమే తమ మొదటి లక్ష్యమని బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్ అన్నారు. సోమవారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేను కలిశారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. తప్పకుండా అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అరా తీశారు.