బహదూర్ పురా: సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించిన కార్పొరేటర్
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని జగనుమా డివిజన్ కార్పొరేటర్ ముక్తాధర్ బాబా అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలో స్థానికుల ఫిర్యాదు మేరకు డ్రైనేజీ సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. వెంటనే సిబ్బందిని పిలిపించి మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. మరోసారి సమస్యలు రాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.