పాతబస్తీ పోలీసు స్టేషన్ లో సీపీ ఆకస్మిక తనిఖీ

78చూసినవారు
పాతబస్తీలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ ను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీపీతో పాటు సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి, సౌత్ ఈస్ట్ అడిషనల్ డిసీపీ స్వామి తదితరులు ఉన్నారు. స్టేషన్ లోని రికార్డ్స్ తనిఖీ చేసిన సీపీ కేసులు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించాలని, డ్యూటీలో నిర్లక్ష్యం పనికిరాదని సిబ్బందికి సీపీ సూచించారు.