ఓ యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై ఫోక్షో కేసు నమోదు అయిన ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి కథనం ప్రకారం. బండ్లగూడ పరిధిలో నివాసం ఉంటున్న జూబైర్ అనే వ్యక్తి తరచుగా ఇంటికి వచ్చి తన కూతురిపై అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు. యువతి కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడన్నారు. ఈవిషయమై పీఎస్ లో పిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు అయింది