
చాంద్రాయణగుట్ట: చొల్లంగి అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామి ఆలయంలో పూజలు
ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో శ్రీ శివాలయం ప్రాంగణములో గల శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో బుధవారం చొల్లంగి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. దీప దూపాలను వెలిగించి, కూష్మాండ దీపారాధన చేశారు. ఫల, పుష్ప, నైవేద్యాలను సమర్పించి టెంకాయలు కొట్టారు.