రంగారెడ్డి జిల్లా మణికొండ పరిధిలోని పుప్పాల్‌గూడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోల్డెన్ ఓరియేల్ అపార్ట్మెంట్లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో శుక్రవారం అపార్ట్మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ ఇంట్లోని ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఫైరింజన్ వెళ్లేదారి సరిగా లేకపోవడంతో సిబ్బంది గంటపాటు శ్రమించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.