తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగుల జేఏసీ నాయకులు తమ డిమాండ్ల సాధన కోసం బుధవారం హైదరాబాద్ అబిడ్స్ లోని డాక్ సదన్, జీపీఓ ముందు కుటుంబ సభ్యులతో కలిసి మౌన దీక్షకు దిగింది. సుప్రీం కోర్టు నిర్ధారించిన క్యాట్ ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించేంత వరకు దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.