సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నాయకులు
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి ముందు టెర్రరిస్టులకు సంభందించిన వ్యక్తులు రెక్కీ నిర్వహించిన పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ గోషామహల్ నియోజకవర్గం లోని పూరనపూల్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం దహనం చేశారు. రెక్కీ చేసిన వారిని అరెస్ట్ చేయడంతో పాటు వారి వెనకాల ఎవరెవరు ఉన్నారో పోలీసులు భయట పెట్టాలని డిమాండ్ చేశారు.