వరి సాగు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోటీ 53లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో సన్న రకాలు 25 నుంచి 40 లక్షల ఎకరాలకు పెరిగిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడమే అందుకు కారణమని అన్నారు. శుక్రవారం హైదరాబాదు నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.